Breaking News
Loading...

Info Post

నన్ను నమ్మండి.. ఆ ముద్దుల్లో ఏమీ స్పందన ఉండదని ఇప్పుడిప్పుడే తెరకు పరిచయం అవుతున్న ఆలియాభట్ చెబుతుంది. లేటుగా తెరకు పరిచయం అయినా, అనుభవం కలిగిన మాటలు మాట్లాడుతుంది. 2 స్టేట్స్ సినిమాలో ఆమె చేసిన లిప్ లాక్ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.

అంతేకాకుండా ఆమెకు ఒక్కసారిగా అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయారు. ఆలియా, అర్జున్ కపూర్ ల గాఢమైన ముద్దులో మునిగిపోవడం చాలా మందిని ఆకట్టుకొంది. ఈ ఇద్దరి ఎంగిలి పెదాలు చూడాలని నెట్ జన్లు వీడియోల కోసం, ఈ ఇద్దరు ఫోటోల కోసం తెగ సెర్చ్ జరిగినట్లు గూగుల్ అధికారలు చెబుతున్నారు.



ఒక్క ముద్దుతో దేశం మొత్తం తెలిసిపోయిన ఆలియా పై మీడియా ద్రుష్టి పడింది. వెంటనే ఆమెను ప్రత్యేకంగా కలిసి .. అర్జున్ కపూర్ తో ముద్దు సన్నివేశంలో అనుభూతి గురించి కొంచెం చెప్పండని అడగటంతో.. ఎలాంటి సిగ్గు , బిడియం, లేకుండా ఏ హీరోతోనైన ముద్దు సీన్ నటించేటప్పడు.. అంతగా నా నరాలు స్పందించవు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఫీలింగ్ అనేది రాదు. సినిమాల్లో చెంప దెబ్బ సీన్స్ లో కలిగే నొప్పి ఎలా ఉంటుందో.. లిప్ లాక్ లో అంతే స్పందన ఉంటుందని ఆలియా వివరించింది.

ఇప్పుడు ఈ అమ్మడు ముద్దు గురించి ఇంత వివరంగా చెబితే..., ఇక ముందు ముందు పడక సీన్ల గురించి ఎలా చెబుతుందోనని .. నవ్వుకుంటూ మీడియా వారు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆలియాభట్ కు ఎంత అనుభవం ఉందోగానీ .. అందరికి అర్థమయ్యే విధంగా బాగా చెప్పిందని ఆమె అభిమానులు మొచ్చుకుంటున్నారు.

0 comments:

Post a Comment