Breaking News
Loading...

Info Post


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో ఒడిష ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలవటం జరిగింది. అయితే ఆ సమయంలో ఇద్దరి మద్య .. పోలవరం టాపిక్ నడిచినట్లు తెలుస్తోంది. మోదీ.... గారు ఆ వరం(పోలవరం)తో మమ్మల్ని ముంచొద్దు అని నవీన్ పట్నాయక్ కోరారు. తమ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పించి సహాయం అందచేయాలని డిమాండు చేశారు.

అయితే ఎన్డీయేలో చేరే విషయమై ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు.పార్టీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందంతో కలసి మోడిని కలుసుకున్న పట్నాయక్ తన రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రైల్వే ప్రాజెక్టులను గురించి చర్చించారు. ఈ ఇద్దరి మద్య 30 నిమిషాలు పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో నిర్మించనున్న వివాదాస్పద పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాంలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన 130 గ్రామాలతో, లక్షలాది హెక్టర్లలో భూమి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని నవీన్ తెలిపారు. మల్కన్‌గిరి ముంపుపై ఒడిష వ్యక్తం చేస్తున్న ఆందోళనను గుర్తించి, పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని మోడిని కోరినట్లు ఆయన చెప్పారు.

0 comments:

Post a Comment