Breaking News
Loading...

Info Post

రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలతో ఎలా ఉండాలో కూడా తెలియని పరిస్థితుల్లో .. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉన్నారు. తండ్రి బాటలో.. నడుస్తూ.. అత్యాచారం మరకలను. తన ఒంటిపైకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఇద్దరు దళిత టీనేజ్ యువతులపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై నిరసనగా.. ముఖ్యమంత్రి కార్యలయం వద్ద ధర్నా చేపట్టిన వందలాది మంది మహిళలపై.. వాటర్ కెనాన్లు ప్రయోగించి , మరో తప్పు చేశారు అఖిలేష్ యాదవ్. దీంతో.. కేంద్ర హోంశాఖ అఖిలేష్ యాదవ్ పై కన్నెర్ర చేసింది.

దళిత టీనేజ్ యువతులపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కఠిన నిబంధనలతో ఎందుకు కేసులు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయమే తాము రాసిన లేఖ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రితిజు తెలిపారు. నిందితులపై కఠిన చర్య తీసుకోవాల్సిందేనని రితిజు స్పష్టం చేశారు.



ఈ ఘటన చాలా తీవ్రమైన నేరమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. ఆత్మరక్షణలో పడిన అఖిలేష్ ప్రభుత్వం హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్ కుమార్ గుప్తాను బదిలీ చేయడంతోపాటు వెయిటింగ్‌లో పెట్టింది. అయితే మృతులు ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు కాదని శాంతిభద్రతల విభాగం ఐజి అమరేంద్ర సెంగార్ తెలిపారు.

జిల్లా స్థాయి అధికారుల్లో దీనిపై ఎటువంటి గందరగోళం లేదని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేయాలని సిబిఐకి లేఖ రాసిన సంగతి తనకు తెలియదని ఆయన చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, గవర్నర్ బిఎల్ జోషితో సమావేశం కావడం గమనార్హం. మరోవైపు మృతుల తండ్రి తనకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని కోరడం ఈ వ్యవహారంలో కొసమెరుపు.

0 comments:

Post a Comment