Breaking News
Loading...

Info Post


మెగాస్టార్, రాజకీయ నేత అయిన చిరంజీవి పై టాలీవుడ్ లో ఒక పుకారు బలంగా తిరుగుతుంది. ఇంతకీ చిరంజీవి నాయుడా.. రెడా ? అని అందరు మూతులు నాకేసుకుంటున్నారు. పైస ఖర్చులేకుండా పుట్టుకొస్తాయి పుకార్లు. ఇది చదువుతుంటే.. మీకు ఆయన కులం గురించి మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్నారు. అలాగే.. మీరు నిజంగానే.. ఫిజ్జా మీద కాలు పెట్టినట్లే. ఎందుకంటే.. చిరంజీవి నాయుడనే విషయం అందరికి తెలుసు. కానీ కొత్తగా రెడ్డా అని తెరపైకి తెచ్చారు.. టాలీవుడ్ లో సినీ జనాలు. దీనిపై భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నట్లు టాలీవుడ్ సమాచారం.

అంటే.. నిన్నటి వరకు.. రాజకీయ సమస్యలతో బిజీ బిజీ అయ్యి, ఆయన సినీ అభిమానులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చిరంజీవి కోసం 150 సినిమా ఎదురుచూస్తుంది. అంతకంటే.. ఆయన అభిమానులు కూడా .. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు చేస్తాడా అని.. చకోర పక్షుల మాదిరిగా.. అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి చిరంజీవి ఆ సమయం ఆసన్నమైంది. దీంతో.. దర్శకులు, నిర్మాతలు, రైటర్లు.. చిరంజీవి ఇంటి ముందు క్యూ కట్టినట్లు చిత్రపూరి కాలనీ వాసులు అంటున్నారు.

అయితే చిరంజీవి కూడా.. తమ అభిమానులకు.. ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశం .. మంచి కథ కోసం అన్వేషణ చేస్తున్నారు. అనేక కథలను మోసుకొని రైటర్లు.. చిరంజీవి వద్ద వాలిపోతున్నారు. మంచి పట్టున్న కథ కోసం చిరంజీవి అన్ని కథలను ఓపిగ్గా వింటున్నారు. అయితే చివరకు ఇద్దరి రైటర్స్ ను ..ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఒకరు చిన్న క్రిస్ణ శివయ్య నాయుడు, మరోకరు .. వీవీ వినాయక్ కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుతో ఓ కథను రెడి చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి 150వ సినిమా ఒక రేంజ్ లో ఉండాలని. ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఫ్యాన్స్ అంచాలకు రిచ్ అయ్యే విధంగా.. చిరంజీవి ఈ రెండు కథల పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చివరకు చిరంజీవి నాయుడు కథ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అని ..టాలీవుడ్ లో బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ సందర్బంలోనే.. చిరంజీవి నాయుడా... లేక రెడ్డా ,,? అనే మాటలను భారీగా వాడుతున్నట్లు టాలీవుడ్ వాసులు అంటున్నారు. చిరు నాయుడా.. రెడ్డా ..అనేది తెలియాలంటే.. కొన్ని గంటలు ఆగాల్సిందే. ఈకథలపై చిరు .. పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు చిత్రపురి కాలనీ వాసులు .. గుసగుసలాడుకుంటున్నారు.

0 comments:

Post a Comment