Breaking News
Loading...

Info Post



2014 ఎన్నికలలో దేశ ప్రజలిచ్చిన షాక్ నుంచి క్రమంగా తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నెమ్మది నెమ్మదిగా తన బలాలను సమీకరించుకుని వాస్తవంగా ఏ స్థితిలో ఉందో నిర్ధారించుకునే ప్రయత్నంలో పడ్డట్టుగా కనిపిస్తోంది. నిన్న కాంగ్రెస్ పార్టీ లోకసభ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతగా కర్నాటకకు చెందిన మాజీ కేంద్ర మంత్రి మల్లిఖార్జున ఖర్గేని ఎన్నుకుంది.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్షనేతను ఎన్నుకునేందుకు ఈరోజు కాంగ్రెస్ ఎమ్మల్సీలు సమావేశమవబోతున్నారు. శాసన సభలో అవకాశం లేకపోయినా శాసన మండలి లో ప్రతిపక్ష హోదా లభిస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షనేతను ఎన్నుకునే పనిలో పడ్డారు.

ఈరోజు ఇందిరా భవన్ లో జరిగే ఈ సమావేశానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవి హాజరు కానున్నారు. దేశంలోను రాష్ట్రంలోను మిగిలిన బలాలను సమీకరించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లభించిన సమాచారం మేరుక శాసన మండలి ప్రతిపక్షనేతల్లో ఈ క్రిందివారిలో ఒకరిని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది.

సి.రామచంద్రయ్య, రుద్రరాజు పద్మరాజు, కంతేటి సత్యనారాయణరాజు, పాలడుగు వెంకట్రావు.

రాష్ట్రం నుంచి ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి హాజరయ్యే అవకాశం ఉంది.

0 comments:

Post a Comment