ఈ రోజు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు లోనైన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి గోపీనాథ్ పాండురంగ్ ముండే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వైద్యం జరుగుతుండగా మరణించారు.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళేందుకు ఈరోజు ఉదయం 6.30 గంటలకు కారులో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కారులో వెళ్తున్న గోపీనాథ్ ముండే, మోతీనగర్ ప్రాంతంలో దుర్ఘటనపాలయ్యారు. ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ కి తరలించి వైద్యసేవలందించసాగారు. కానీ ఆయనకు తగిలిన తీవ్ర గాయాలకు ఆయన హాస్పిటల్ లోనే మరణించారు.
విషయం తెలిసిన నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఇతర నాయకులు, మీడియాకు తెలియజేసారు. మంత్రిగా పదవీస్వీకారం చేసి ఎన్నో రోజులు కాకముందే జరిగిన ఈ హఠాత్పరిణామానికి భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే భాజపా ప్రభుత్వానికి తగిలిన అతి పెద్ద షాక్ ఇది. అతి తక్కువ మంత్రి వర్గంతో అత్యంత సమర్థవంతమైన పాలనను జరపదలచుకున్న మోదీకి ఇది ఊహించని వార్తయింది.
కేంద్రమంత్రులు గడ్కరీ, హర్షవర్థన్ లు ఎయిమ్స్ కి చేరుకున్నారు. వార్త విన్న మిగిలిన భాజపా నాయకులు కూడా హాస్పిటల్ కి చేరుకుంటున్నారు.
0 comments:
Post a Comment