2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పుంగనూరుకి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎస్.కె.వెంకట రమణా రెడ్డి సోమవారం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు.
పుంగనూరు తెదేపా ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్ రెడ్డి సహచర్యలో పనిచేసిన వెంకటరమణా రెడ్డి 2009 లో పుంగనూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తో కలిసారు. 2010 లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రైన తర్వాత ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దూరంగా వెళ్ళి, ఆయన శత్రు వర్గమైన కిరణ్ కుమార్ తో కలిసారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పోటీచేసేవారు కరువైన సందర్భంలో వెంకటరమణా రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దొరికింది. అయితే ఆయన డిపాజిట్ కూడా కోల్పోయి, వైకాపా తరఫున పోటీచేసిన పెద్దిరెడ్డితో 30000 వోట్ల తేడాతో ఓడిపోయారు.
0 comments:
Post a Comment